ఎస్బీఐ పీఓ 2019 నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు

sbi po bharti 2019 ki puri jaankari

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎబ్బీఐ) మ‌న దేశంలో అంద‌రికీ తెలిసిన ప్ర‌ముఖ బ్యాంక్‌.  చాలా మంది బ్యాంకు ఉద్యోగం చేయాల‌ని కోరుకుంటారు. ఏటా ఎస్బీఐ త‌న కోసం, త‌న అనుబంధ బ్యాంకుల కోసం పీఓ ఉద్యోగాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపి చేస్తుంది. మ‌హిళా, పురుష అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు అప్ల‌య్ చేసుకోవ‌డానికి అర్హులు.  ఎస్బీఐ బ్యాంక్ పీఓ 2019 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన స‌మాచారం మీరు ఈ ఆర్టిక‌ల్ లో తెలుసుకోవ‌చ్చు.

ఈ ఆర్టిక‌ల్ లో కింది విష‌యాలు తెలుసుకోండి

ఎస్బీఐ బ్యాంక్ పీఓ అంటే ఏమిటి?

ఎస్బీఐ పీఓ ఉద్యోగ బాధ్య‌త‌లు ఏమి?

ఎస్బీఐ బ్యాంక్ పీఓ 2019 నోటిఫికేష‌న్ ఖాళీల వివ‌రాలు?

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ఉద్యోగ అర్హ‌త‌లు ఏమిటి?

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ఉద్యోగానికి అర్హులెవ‌రు?

ఎస్బీఐ బ్యాంక్ పీఓల‌కు వ‌చ్చే జీత‌భత్యాలు

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష తేదీలు

ఎస్బీఐ బ్యాంక్ పీఓ 2019 ద‌ర‌ఖాస్తు ఫామ్

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ఎంపిక విధానం

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష విధానం

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష సిల‌బ‌స్‌

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి?


ప్ర‌.1) 12వ త‌ర‌గ‌తి పాసైన‌వాళ్లు ఈ పీఓ ప‌రీక్ష‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చా?

జ‌) ఎస్బీఐ బ్యాంక్ పీఓ ఉద్యోగాల‌కు డిగ్రీ పాసైన‌వాళ్లు మాత్ర‌మే అప్ల‌య్ చేసుకోవ‌డానికి అర్హులు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ పాసైన‌వాళ్లు మాత్ర‌మే ఈ ఉద్యోగానికి అర్హులు.

ప్ర‌.2)  డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌వాళ్లు ఈ ఉద్యోగానికి అప్ల‌య్ చేసుకోవ‌చ్చా.

జ‌)  చేసుకోవ‌చ్చు. డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌వాళ్లు కూడా అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.

ప్ర.3) ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష 2019కి సంబంధించి అధికారిక నోటిఫికేష‌న్ వెలువ‌డిందా?

జ‌) అవును, అధికారిక నోటిఫికేష‌న్ 2019 ఏప్రిల్ 1న విడుద‌లైంది.

ప్ర‌.4) జాబ్ అప్లికేష‌న్ ఫామ్ ఆన్‌లైన్‌లో ల‌భిస్తోందా? ఎగ్జామ్ ఏ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది?

జ‌) అప్లికేష‌న్ ఫామ్ ఆన్ లైన్‌లో ల‌భిస్తుంది. ఎగ్జామ్ కూడా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలోనే జ‌రుగుతుంది.

ప్ర‌.5) ఎస్బీఐ పీఓ పోస్టుకు గ‌తంలో ప‌నిచేసిన అనుభ‌వం అవ‌స‌ర‌మా?

జ‌.గ‌తంలో ప‌నిచేసిన అనుభ‌వం అవ‌స‌రం లేదు. డిగ్రీ పాసైతే పీఓ పోస్టు ప‌రీక్ష రాసేందుకు మీరు అర్హుల‌వుతారు.

ప్ర‌.6) ఎస్బీఐ పీఓ ఎగ్జామ్ ఇంగ్లీష్ లోనే మాత్ర‌మే నిర్వ‌హిస్తారా?

జ‌. లేదు. మీరు ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లోనూ ఎగ్జామ్ రాయొచ్చు.

ప్ర‌.7) ఎస్సీ, ఎస్టీ కేట‌గిరీకి చెందిన‌వాళ్లు ఎన్నిసార్లు ఈ ఎగ్జామ్ రాయొచ్చు?

జ‌. ఎస్సీ, ఎస్టీ కేట‌గిరీకి చెందిన‌వాళ్లు ఎన్నిసార్ల‌యినా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. మిగ‌తా కేట‌గిరీల‌వాళ్లు ఎన్నిసార్లు ఈ ప‌రీక్ష రాయొచ్చ‌నేది ఎల్జిబిలిటీ సెక్ష‌న్ లో ప‌రిశీలించుకోవాలి.

ప్ర‌.8) ఈ ప‌రీక్ష‌కు సంబంధించి జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ సెక్ష‌న్ కోసం ఎలాంటి పుస్త‌కాలు చ‌ద‌వాలి?

జ‌.  లూసెంట్ ప‌బ్లికేష‌న్ వారి జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ పుస్త‌కాలు ఈ ప‌రీక్షకు ప్రిపేర్ కావ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఇత‌ర సెక్ష‌న్ల‌కు సంబంధించి మంచి పుస్త‌కాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

ప్ర‌.9) ఎస్బీఐ పీఓ 2019 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఏ తేదీన నిర్వ‌హిస్తారు?

జ‌. 2019 జూన్ 8, 9, 15, 16వ తేదీల్లో ఎస్బీఐ పీఓ ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.


SBI ‘Probationary Officer (PO) jobs 2019

ఎస్బీఐ బ్యాంక్ పీఓ అంటే ఏమిటి?

పీఓ అంటే ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌. బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి పోస్టు ఇది.

ఎస్బీఐ పీఓ ఉద్యోగ బాధ్య‌త‌లు ఏమి?

బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి ప‌నులైనా పీఓ నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. లోన్లు, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌, అకౌంట్స్‌, న‌గ‌దు వ్య‌వ‌హారాలు, చెల్లింపులు, చెక్కుల క్లియ‌రెన్స్‌, ఏటీఎమ్ ఫిర్యాదులు, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఇలా వివిధ డిపార్టుమెంటుల్లో పీఓలు ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఎస్పీఐ పీఓ ఉద్యోగాల్లో ఎదుగుద‌ల‌కు ఎలాంటి అవ‌కాశాలుంటాయి? (ప‌్ర‌మోష‌న్ల‌లో ఉండే స్థాయిలు ఏమిటి?)

ఎస్పీఐ పీఓ ఉద్యోగాల్లో ఎదుగుద‌ల‌కు చాలా అవ‌కాశాలుంటాయి. పీఓల‌కు వ‌చ్చే ప్ర‌మోష‌న్ల స్థాయిలు ఈ కింది విధంగా ఉంటాయి.

  • పీఓ
  • డిప్యూటీ మేనేజ‌ర్
  • మేనేజ‌ర్‌
  • చీఫ్ మేనేజ‌ర్‌
  • అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌
  • డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్
  • జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌

ఎస్బీఐ బ్యాంక్ పీఓకు ఉండాల్సిన అవ‌స‌ర‌మైన నైపుణ్యాలేమిటి?

మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్, కంప్యూట‌ర్ స్కిల్స్‌, లీడ‌ర్‌షిప్ స్కిల్స్, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే నైపుణ్యం, త్వ‌ర‌గా నేర్చుకునే త‌త్వం, టీమ్ ప్లేయ‌ర్ మొద‌లైన‌వి….

ఎస్బీఐ బ్యాంక్ పీఓ 2019 నోటిఫికేష‌న్ ఖాళీల వివ‌రాలు

2019 సంవ‌త్సరానికి ఇండియాలోని అన్ని ఎస్బీఐ బ్రాంచుల్లో క‌లుపుకుని మొత్తం 2 వేల ఎస్బీఐ పీఓ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

కేట‌గిరీఎస్సీఎస్టీఓబీసీ(నాన్ క్రిమిలేయ‌ర్‌)ఈడ‌బ్యూఎస్జ‌న‌ర‌ల్మొత్తంఎల్డీవీఐహెచ్ ఐడీ అండ్ ఐ
ఖాళీలు300150540200810200020202020
బ్యాక్‌లాగ్‌53
మొత్తం300150540200810200020207320


ఎస్బీఐ బ్యాంక్ పీఓ ఉద్యోగ అర్హ‌త‌లు ఏమిటి?

సిటిజ‌న్‌షిప్ (పౌర‌స‌త్వం)

  1. పీఓ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థి కింది వాటిలో ఏదేని పౌర‌స‌త్వం క‌లిగి ఉండాలి.

(i) భార‌త పౌరుడై ఉండాలి లేదా

(ii) నేపాల్ కు చెందిన‌వారైతే

(iii) భూటాన్‌కు చెందిన‌వారైతే

(iv) టిబెట‌న్ శ‌ర‌ణార్థి అయితే జ‌న‌వ‌రి 1, 1962లోగా భార‌త్‌కు వ‌చ్చి ఇక్క‌డే స్థిర‌ప‌డాల‌నే ఉద్దేశం ఉన్న‌వారు. లేదా

(v) భార‌త సంత‌తికి చెంది ఉండి పాకిస్థాన్‌, బ‌ర్మా, శ్రీలంక‌, తూర్పు ఆఫ్రికా దేశాలైన కెన్యా, ఉగాండా, ది రిప‌బ్లిక్ ఆఫ్ టాంజానియా (గ‌తంలో టాంజాకియా, జాంబియార్‌), జాంబియా, మ‌లావి, జైర్, ఇథియోపియా, వియ‌త్నాం దేశాల నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌వాళ్లు అర్హులు. అయితే ఇలాంటివాళ్లు ఇక్క‌డే స్థిర‌ప‌డాల‌నే ఉద్దేశం క‌లిగి ఉండాలి. పైన తెలిపిన (ii), (iii), (iv) & (v) కేట‌గిరీల‌కు చెందిన వ్య‌క్తులు భార‌త ప్ర‌భుత్వం జారీ చేసిన అర్హ‌త సర్టిఫికెట్ ను క‌లిగి ఉండాలి.

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష 2019కి వ‌యో ప‌రిమితి

వ‌యో ప‌రిమితి: 21-30 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్కులు(జ‌న‌ర‌ల్ కేట‌గిరీవారికి)

రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీకి చెందిన‌వాళ్లు వ‌యో ప‌రిమితి కోసం పైన ఇచ్చిన టేబుల్ ను ప‌రిశీలించండి.

ఎస్బీఐ పీఓ ప‌రీక్షకు సంబంధించి రిజ‌ర్వేష‌న్ వ‌ర్గాలకుండే సౌక‌ర్యాలు

రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీ వాళ్ల‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపులో మిన‌హాయింపు ఉంటుంది.

ఈ మిన‌హాయింపు వినియోగించుకోవాలంటే అభ్య‌ర్థులు ప్ర‌భుత్వం జారీ చేసిన కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం లేదా రిజ‌ర్వేష‌న్ ను స‌మ‌ర్థించే డాక్యుమెంట్ కానీ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

అభ్య‌ర్థుల కేట‌గిరీవ‌యో ప‌రిమితి స‌డ‌లింపు
ఎస్సీ, ఎస్టీ5 ఏళ్లు
ఓబీసీలు3 ఏళ్లు
జ‌న‌ర‌ల్ (పీడ‌బ్ల్యూడీ)10 ఏళ్లు
ఎస్సీ, ఎస్టీ(పీడ‌బ్ల్యూడీ)15 ఏళ్లు
ఓబీసీ(పీడ‌బ్ల్యూడీ)13 ఏళ్లు
జ‌మ్ము, క‌శ్మీర్లో నివ‌సించేవాళ్లు(1980 నుంచి 1989 వ‌ర‌కు)5 ఏళ్లు
మాజీ సైనికులు/ విక‌లాంగులైన మాజీ సైనికులు  ఆర్మీలో ప‌నిచేసిన స‌ర్వీసు+3 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీకి చెందిన విక‌లాంగులైన మాజీ సైనికోద్యోగుల‌కు 8 ఏళ్లు) నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి గ‌రిష్టంగా 50 ఏళ్ల వ‌ర‌కు మిన‌హాయింపు
విధ‌వ‌లు, విడాకులు పొందిన మ‌హిళ‌లు, చ‌ట్ట‌ప‌రంగా భ‌ర్త‌ల నుంచి వేరుప‌డిన‌వాళ్లు, ఆ త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న‌వారు7 ఏళ్లు (నిబంధ‌న‌లు అనుస‌రించి జ‌న‌ర‌ల్ కేట‌గిరీ వారికి 35 ఏళ్లు, ఓబీసీల‌కు 38 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీల‌కు 40 ఏళ్లు)

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష ఎవ‌రు ఎన్నిసార్లు రాయొచ్చు?

కేట‌గిరీ ప్ర‌య‌త్నాల సంఖ్య‌
జ‌న‌ర‌ల్  7
జ‌న‌ర‌ల్ (పీడ‌బ్ల్యూడీ)7
ఓబీసీ 7
ఓబీసీ (పీడ‌బ్ల్యూడీ)7
ఎస్సీ/ఎస్సీ(పీడ‌బ్ల్యూడీ)/ఎస్టీ/ఎస్టీ(పీడ‌బ్ల్యూడీ)ప‌రిమితి లేదు

 

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ఉద్యోగానికి అర్హులెవ‌రు?

·     గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండ‌టం.

·      కామ‌ర్స్ లో డిగ్రీ చేసి ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి కాదు. ఇత‌ర స‌బ్జెక్టుల్లో డిగ్రీ చేసిన‌వాళ్లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

·      ప్ర‌తి ఉద్యోగ ఖాళీకి వ‌యో ప‌రిమితిలో కొన్ని స‌డ‌లింపులుంటాయి. రిజ‌ర్వేష‌న్ అభ్య‌ర్థుల‌కు వ‌ర్తించే రిజ‌ర్వేష‌న్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

ఎస్బీఐ బ్యాంక్ పీఓల‌కు వ‌చ్చే జీత‌భత్యాలు

· ప్రాథ‌మిక‌(బేసిక్‌) జీతం రూ.27,650. దీనికి అద‌నంగా టీఏ/డిఏ, మెడిక‌ల్ ఆలోయెన్స్‌, ఇత‌ర ఆలోయెన్సులుంటాయి.

·  చేతికొచ్చే జీతం: ఏడాదికి క‌నిష్టంగా రూ.7.55 ల‌క్ష‌లు, గ‌రిష్టంగా రూ.12.93 ల‌క్ష‌లు. పోస్టును బ‌ట్టి ప‌ని చేసే ఊరును బ‌ట్టి జీతాల్లో మార్పు ఉంటుంది.

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష తేదీలు

వివ‌రాలు                                                                                                                తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్(ద‌ర‌ఖాస్తులో మార్పులు, చేర్పులు క‌లిపి) 02.04.2019 నుంచి 22.04.2019
ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సింది 02.04.2019 నుంచి 22.04.2019
ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు కాల్ లెట‌ర్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సింది             మే 2019 3వ వారం నుంచి
ఆన్‌లైన్ ప‌రీక్ష    ప్రిలిమిన‌రీ 8, 9, 15, 16వ తేదీ జూన్ తేదీల్లో
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఆన్‌లైన్ ఫలితాలుజులై 2019 మొద‌టి వారంలో
ఆన్ లైన్ మెయిన్స్ ప‌రీక్ష కాల్ లెట‌ర్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిజులై 2019 రెండో వారం నుంచి
ఆన్ లైన్ మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ   20.07.2019
ఫ‌లితాల వెల్ల‌డి  ఆగ‌స్టు 2019 మూడో వారంలో
గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ కు కాల్ లెట‌ర్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సింది ఆగ‌స్టు 2019 నాలుగో వారంలో
గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ నిర్వ‌హ‌ణ  సెప్టెంబ‌ర్ 2019
తుది ఫ‌లితాల ప్ర‌క‌ట‌న అక్టోబ‌ర్ 2019 రెండో వారం నుంచి

స్టేట్ బ్యాంక్ పీఓ ఉద్యోగాల భ‌ర్తీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ఆఖ‌రు తేది ఏప్రిల్ 22, 2019.

ఎస్బీఐ బ్యాంక్ పీఓ 2019 ద‌ర‌ఖాస్తు ఫామ్?

1.మొద‌ట ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి. ఎస్బీఐ పీఓ 2019 అన్న కాల‌మ్ మీద క్లిక్ చేయండి. ఆ త‌ర్వాత న్యూ రిజిస్ట్రేష‌న్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయండి. బేసిక్ ఇన్‌ఫో, సిగ్నేచ‌ర్‌, డిటెయిల్స్ సెక్ష‌న్ మీద క్లిక్ చేసి మీ పేరు రిజిస్ట‌ర్ చేసుకోండి. అప్లికేష‌న్‌లో మీ వివ‌రాలు జాగ్ర‌త్త‌గా నింపండి. ద‌ర‌ఖాస్తులో ఏవైనా త‌ప్పులు దొర్లితే మీ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యే అవ‌కాశం కూడా ఉంటుంది.

register_sbi_po

application form sbi

2.ఒక‌సారి మీరు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న త‌ర్వాత మీకు ప్రొవిజిన‌ల్ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌, పాస్ వ‌ర్డ్ జ‌న‌రేట్ అవుతుంది. మీరు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు మీ రిజిస్టర్డ్ మెయిల్, ఫోన్ నెంబ‌ర్‌కు ధ్రువీక‌ర‌ణ సందేశం(క‌న్మ‌ఫ‌ర్మేష‌న్ మేసేజ్‌) వ‌స్తుంది.

3.నిర్దేశించిన విధానంలో అభ్య‌ర్థులు త‌మ ఫోటో, సంత‌కాన్ని ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తులో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు ఇటీవ‌ల తీయించుకున్న పాస్ పోర్ట్ సైజు క‌ల‌ర్ ఫొటో బాగా క్లారిటీ ఉన్న‌ది, బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ బాగా ఉన్న‌ది అప్ లోడ్ చేయాలి.

Candidate’s recent, colour, passport-size photograph of good quality with light backgroundImage dimensions: 200 X 230Pixels File Type: JPGFile size: 20 KB – 50 KB
Applicant’s signatureImage dimensions: 140 X 60Pixels File Type: JPGFile size: 10 KB – 20 KB
*ద‌ర‌ఖాస్తు పూర్తి చేయ‌డానికి స్కాన్ చేసిన ఫొటో, సంత‌కం త‌ప్ప‌నిస‌రి.
ఎస్బీఐ బ్యాంక్ పీఓ అప్లికేష‌న్ ఫీజు 2019
అప్లికేష‌న్ ఫామ్ ఆన్ లైన్ లో ల‌భిస్తోంది. ప‌రీక్ష ఫీజు చెల్లింపు కూడా ఆన్ లైన్ లో చేయొచ్చు.
వివిధ కేట‌గిరీల అభ్య‌ర్థులు చెల్లించాల్సిన ఫీజు వివ‌రాలు
  • ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.100 చెల్లించాలి.
  • రూ.మిగ‌తా కేట‌గిరీల అభ్య‌ర్థులంతా రూ.600 చెల్లించాలి.

ఎస్బీఐ పీఓ అధికారిక నోటిఫికేష‌న్ డౌన్ లోడ్ చేసుకోండి.

ఎస్బీఐ పీఓ నోటిఫికేష‌న్ డౌన్ లోడ్ చేసుకోండి.

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ఎంపిక విధానం

ఎస్బీఐ బ్యాంక్ పీఓ రిక్రూట్‌మెంట్ మూడు ద‌శ‌ల్లో జ‌రుగుతుంది.
1. ఎస్బీఐ పీఓ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌
2.ఎస్బీఐ పీఓ మెయిన్స్ ప‌రీక్ష‌
3.ఎస్బీఐ గ్రూప్ డిస్క‌ష‌న్‌(జీడీ), ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ(పీఐ)
ఎస్పీఐ బ్యాంక్ పీఓ ఎగ్జామ్ మీడియం 2019
అన్నీ ప‌రీక్ష‌లు ఆన్ లైన్ లో జ‌రుగుతాయి. హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ప‌రీక్ష రాయొచ్చు.
ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష విధానం
ఎస్బీఐ పీఓ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (అబ్జెక్టివ్ టెస్ట్)
ఈ సెక్ష‌న్ మూడు భాగాలుగా ఉంటుంది. గంట‌లోగా ఈ ప‌రీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.
క్ర‌మ సంఖ్యటాపిక్ప్ర‌శ్న‌లుమార్కులుస‌మ‌యం
1ఇంగ్లీష్3030
2క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌3535
3రీజ‌నింగ్ ఎబిలిటీ3535
4మొత్తం10010060 నిమిషాలు

నెగెటివ్ మార్కింగ్ : ప‌్ర‌తి ఒక్క త‌ప్పు స‌మాధానానికి అభ్య‌ర్థి స్కోరు చేసిన మార్కుల నుంచి 1/4 మార్కులు

2. ఎస్బీఐ పీఓ మెయిన్స్ ప‌రీక్ష‌

ఎస్బీఐ పీఓ మెయిన్స్ అబ్జెక్టివ్ టెస్టు 3 గంట‌ల్లో రాయాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్ష‌లో 4 సెక్ష‌న్లు ఉంటాయి.  మొత్తం 200 మార్కుల‌కు ఈ ప‌రీక్ష ఉంటుంది.

 

క్ర‌మ సంఖ్యటాపిక్ప్ర‌శ్న‌లుమార్కులుస‌మ‌యం
1రీజ‌నింగ్ అండ్ కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్‌456060 నిమిషాలు
2డేటా అనాల‌సిస్ అండ్ ఇంట‌ర్‌ప్రిటేష‌న్‌356045 నిమిషాలు
3జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అబౌట్ ఎకాన‌మీ, బ్యాకింగ్‌404035 నిమిషాలు
4ఇంగ్లీష్ 354040 నిమిషాలు
మొత్తం155200180 నిమిషాలు

 

రాత పరీక్ష‌(డిస్క్రిప్టివ్ టెస్టు)

ఎస్బీఐ పీఓ మెయిన్స్ లో రెండు సెక్ష‌న్లు ఉంటాయి. ఒక‌టి అబ్జెక్టివ్‌, రెండోది డిస్క్రిప్టివ్‌. అబ్జెక్టివ్ సెక్ష‌న్ 200 మార్కుల‌కు ఉంటుంది. డ‌స్క్రిప్టివ్ సెక్ష‌న్ 50 మార్కుల‌కు ఉంటుంది. ఒకే రోజు అబ్జెక్టివ్ టెస్టు అయిన త‌ర్వాత డిస్క్రిప్టివ్ టెస్టు నిర్వ‌హిస్తారు.

ఎస్బీఐ పీవో డిస్క్రిప్టివ్ టెస్టు 50 మార్కుల‌కు ఉంటుంది. 30 నిమిషాల్లో ఈ టెస్టు రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీషులో రాసే నైపుణ్యాల‌ను ఇందులో ప‌రిశీలిస్తారు. ఇందులో రెండు సెక్ష‌న్లు ఉంటాయి. అవి లేఖ ర‌చ‌న, వ్యాస ర‌చ‌న‌.

 

ఫేజ్ 3: ఎస్బీఐ పీఓ గ్రూప్ డిస్క‌ష‌న్ (జీడీ), ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ(పీఐ)

ఉద్యోగాల ఎంపిక కోసం రూపొందించే ఫైన‌ల్ మెరిట్ లిస్టులో ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో సాధించిన మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోరు. గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో వ‌చ్చిన మార్కుల‌కు మెయిన్స్ ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల‌కు జ‌త‌చేసి ఫైన‌ల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. అభ్య‌ర్థులు ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్ష‌ల‌కు వేర్వేరుగా ఉత్తీర్ణ‌త సాధించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో 250 మార్కుల‌కు గాను అభ్య‌ర్థి సాధించిన మార్కుల‌ను 75 మార్కుల‌కు బేరీజు వేసి మారుస్తారు. గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూల‌లో 50 మార్కుల‌కుగాను సాధించిన మార్కుల‌ను 25 మార్కుల‌కు బేరీజు వేసి మారుస్తారు. ఇలా ఈ రెండు ప‌ద్ధ‌తుల్లో వంద మార్కుల‌కు లెక్కేసి అభ్య‌ర్థుల‌కు వ‌చ్చిన మార్కుల‌ను ఫైన‌ల్ మెరిట్ లిస్టు త‌యారు చేయ‌డంలో ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకుంటారు. మెయిన్స్‌కు, గ్రూప్ డిస్క‌ష‌న్‌కు, ఇంట‌ర్వ్యూకు, ఫైన‌ల్ మెరిట్ లిస్టులో ఎంపికైన‌వారి పేర్లు ఎస్బీఐ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

 

క్ర‌మ సంఖ్యరౌండ్   గ‌రిష్ట మార్కులు  
1గ్రూప్ డిస్క‌ష‌న్ 20
2ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ 20
మొత్తం40

 

ఎస్బీఐ పీఓ ఫైన‌ల్ సెల‌క్ష‌న్‌

క్ర‌మ సంఖ్యప‌రీక్ష పేరు గ‌రిష్ట మార్కులు క‌నిష్ట మార్కులు
1మెయిన్స్ ఎగ్జామినేష‌న్ (ఫేజ్ 2)22575
2జీడీ అండ్ ఇంట‌ర్వ్యూ (ఫేజ్ 3)5025
మొత్తం275100

 

ఎస్బీఐ పీఓ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ 2019

ఎస్సీ, ఎస్టీ, మ‌త‌ప‌ర‌మైన మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఏర్పాటు చేస్తారు. ఐబీపీఎస్ పీఓ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ఉచితంగా అందిస్తారు. ప‌రీక్ష జ‌రిగే విధానం, ప్రిప‌రేష‌న్‌లో పాటించాల్సిన మెళుకువ‌లపై నిపుణులైన బోధ‌కులు అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ ఇస్తారు. సాధార‌ణంగా ఈ శిక్ష‌ణ 5 రోజుల‌పాటు ఉంటుంది. అభ్య‌ర్థులు ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలోనే శిక్ష‌ణ కోసం అభ్య‌ర్థ‌న చేసుకోవ‌చ్చు.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ జ‌రిగే న‌గ‌రాలు: అగ‌ర్తలా, ఆగ్రా, అహ్మ‌దాబాద్‌, ఐజ్వాల్, అకోలా, అల‌హాబాద్‌, అస‌న‌ల్, ఔరంగాబాద్‌, బ‌రేలి, భువ‌నేశ్వ‌ర్‌, బెర్హామ్‌పూర్‌(గంజాం), బోఫాల్, బెంగ‌ళూరు, చండీఘ‌డ్‌, చెన్నై, కోయంబ‌త్తూర్‌, డెహ్రాడూన్, దిబ్రూఘ‌ర్, ఎర్నాకుళం, గ్యాంగ్‌ట‌క్‌, గోర‌ఖ్‌పూర్, గుల్బ‌ర్గా, గౌహ‌తి, హుబ్లి, హైద‌రాబాద్‌, ఇంఫాల్, ఇండోర్‌, ఇటాన‌గ‌ర్‌, జ‌బ‌ల్ పూర్, జైపూర్, కాన్పూర్, కోహిమ‌, కోల్‌క‌తా, ల‌క్నో, మ‌ధురై, మీర‌ట్, ముంబ‌యి, మైసూర్, నాగ్‌పుర్, న్యూఢిల్లీ, ప‌నాజీ(గోవా), ప‌ట్నా, పోర్ట్ బ్లెయిర్‌, పుర్నియా, పుణె, రాయ్‌పుర్‌, రాంచీ, సంబ‌ల్‌పూర్, సిల్చార్‌, సిలిగురి, షిల్లాంగ్‌, శ్రీన‌గ‌ర్, టూరా, తిరుప‌తి, వ‌డోద‌ర‌, వార‌ణాసి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌.

ఎస్బీఐ పీఓ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు తాము శిక్ష‌ణ పొందిన‌చోట రెండేళ్లు ప్రొబేష‌న్ పిరియ‌డ్ లో ప‌ని చేయాల్సి ఉంటుంది.

త‌మ ఉద్యోగ బాధ్య‌త‌ల‌ను తెలుసుకోవ‌డానికి పీఓ ఉద్యోగుల‌ను వివిధ విభాగాల్లో ప‌ని చేసేలా శిక్ష‌ణ ఇస్తారు. ప్రొబేష‌న‌రీ పిరియ‌డ్ పూర్త‌య్యాక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజ‌ర్‌గా ప‌దోన్న‌తి క‌ల్పిస్తారు.

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్ష సిల‌బ‌స్‌?

1.ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ (అబ్జెక్టివ్ టైప్‌)

 

క్ర‌మ సంఖ్యసెక్ష‌న్ టాపిక్స్‌
1ఇంగ్లీష్రీడింగ్ కాంప్రిహెన్ష‌న్‌, క్లోజ్ టెస్ట్, ఫిల్ల‌ర్స్‌, వ్యాక్య నిర్మాణ దోషాలు, ఉచ్ఛార‌ణ‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు, వాక్య నిర్మాణం మెరుగుప‌ర‌చ‌డం, గ‌జిబిజి పేరాల‌ను స‌రి చేయ‌డం, పేరాల ఆధారంగా ప్ర‌శ్న‌లు రూపొందించ‌డం (పేరాగ్రాఫ్ ఫిల్ల‌ర్స్, పేరాగ్రాఫ్ క‌న్‌క్లూజ‌న్‌, పేరాగ్రాఫ్/వ‌్యాక్యాల‌ను పున‌ర్ నిర్వంచించ‌డం(రీస్టేట్ మెంట్)
2రీజ‌నింగ్ ఎబిలిటీప‌జిల్స్‌, సీటింగ్ ఆరెంజ్‌మెంట్స్‌, డైరెక్ష‌న్ సెన్స్, ర‌క్త సంబంధాలు, బంధుత్వాలు, నిజం-అబ‌ద్ధాల విశ్లేష‌ణ‌, ఆర్డ‌ర్ మ‌రియు ర్యాంకింగ్, కోడింగ్‌-డీకోడింగ్, మెషీన్ ఇన్‌పుట్-అవుట్‌పుట్, అస‌మాన‌త‌లు, అల్ఫా న్యూమ‌రిక‌ల్ సింబ‌ల్‌, సిరీస్‌, స‌మాచార‌(డేటా) నిజ నిర్దార‌ణ‌, లాజిక‌ల్ రీజ‌నింగ్‌(ఆధారాలు, విశ్లేష‌ణ ఆధారంగా పేరాగ్రాఫ్‌ల విశ్లేష‌ణ‌, ప్ర‌క‌ట‌న‌లు మ‌రియు వాటిని నిజ నిర్దార‌ణ‌, ముగింపు, వాద‌న‌లు)
3న్యుమ‌రిక‌ల్ ఎబిలిటీ(గ‌ణితం)అంక గ‌ణిత స‌మ‌స్య‌లు(గ‌సాభా, క‌సాభా), లాభం-న‌ష్టం, కాలానికి సంబంధించిన స‌మ‌స్య‌లు, ప‌ని మ‌రియు కాలం, వేగం-దూరం-కాలం, వివిధ ర‌కాల వ‌డ్డీల లెక్క‌లు, క‌ర‌ణులు, ఘాతాంకాలు, సంభావ్య‌త‌లు, కొల‌త‌లు, సంఖ్య‌ల కూర్పు, స‌రాస‌రి, కాంబినేష‌న్‌, నిష్ప‌త్తులు,  భాగాలు, భాగ‌స్వామ్యాలు, ప్రాబ్ల‌మ్స్ ఆన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాబ్ల‌మ్స్ ఆన్ ట్రైన్స్, మిక్చ‌ర్ అండ్ అలిగేష‌న్‌, పైప్స్ అండ్ సిస్ట‌ర్న్స్ట్‌, నంబ‌ర్ సిస్ట‌మ్‌, డేటా ఇంట‌ప్రిటేష‌న్‌(స‌మాచార వివ‌ర‌ణ‌), సీక్వెన్స్ అండ్ సిరీస్‌


2.మెయిన్స్ ఎగ్జామ్ (అబ్జెక్టివ్ టెస్టు)

క్ర‌మ సంఖ్య సెక్ష‌న్       పుస్త‌కాల పేర్లు
1.ఇంగ్లీష్‌రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామ‌ర్‌, వొకాబుల‌రీ, వ‌ర్బ‌ల్ ఎబిలిటీ, వ‌ర్డ్ అసోసియేష‌న్‌, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, జంబుల్డ్ పేరాగ్రాఫ్, పేరాగ్రాఫ్ బేస్‌డ్ క్వ‌శ్చ‌న్స్ (పేరాగ్రాఫ్ ఫిల్ల‌ర్స్‌, పేరాగ్రాఫ్ క‌న్‌క్లూజ‌న్‌, పేరాగ్రాఫ్/సెంటెన్స్ రీస్టేట్ మెంట్‌), ఎర్ర‌ర్ స్పాటింగ్‌, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్‌.
2.రీజ‌నింగ్ ఎబిలిటీప‌జిల్స్‌, సీటింగ్ ఆరెంజ్ మెంట్స్, డైరెక్ష‌న్ సెన్స్‌, ర‌క్త సంబంధాలు, బంధుత్వాలు, కుటుంబ సంబంధాలు, సింపోజియం, ఆర్డ‌ర్ అండ్ ర్యాంకింగ్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, మెషీన్ ఇన్‌పుట్, అవుట్‌పుట్‌, అస‌మాన‌త‌లు, అల్ఫా న్యూమ‌రిక్ సింబ‌ల్, సిరీస్‌, డేలా స‌ఫిషియ‌న్సీ, లాజిక‌ల్ రీజనింగ్‌(ప్యాసేజ్ ఇన్‌ఫ‌రెన్స్, స్టేట్ మెంట్ అండ్ అస‌మ్ష‌న్‌, క‌న్‌క్లూజ‌న్, ఆర్గ్యుమెంట్)
3.డేటా అనాల‌సిస్‌ట్యాబుల‌ర్ గ్రాఫ్‌, లైన్ గ్రాఫ్‌, బార్ గ్రాఫ్‌, మిస్సింగ్ కేస్ ఐడీ, డేటా స‌ఫిషియ‌న్సీ, ప్రొబ‌బిలిటీ, ప్రీమెట్యూయేష‌న్ అండ్ కాంబినేష‌న్‌
4.జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్‌, ఫైనాన్సియ‌ల్ అవేర్‌నెస్‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, విధానాలు, క‌రెంట్ అఫైర్స్, స్టాటిక్ అవేర్‌నెస్
5.కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్‌హిస్ట‌రీ అండ్ జ‌న‌రేష‌న్ ఆఫ్ కంప్యూట‌ర్స్‌, ఇంట్ర‌డ‌క్ష‌న్ టు కంప్యూట‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌, కంప్యూట‌ర్ మొమొరీ, కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ అండ్ ఐ/ఓ డివైసెస్‌, కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్‌, కంప్యూట‌ర్ లాంగ్వేజెస్‌, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, కంప్యూట‌ర్ నెట్ వ‌ర్క్‌, ఇంట‌ర్నెట్, ఎంఎస్ ఆఫ్‌స్ సూట్ అండ్ షార్ట్ క‌ట్ కీస్, బేసిక్స్ ఆఫ్ డీబీఎస్ఎంస్‌, నంబ‌ర్ సిస్ట‌మ్ అండ్ క‌న్వ‌ర్‌సిస‌న్స్‌, కంప్యూట‌ర్ అండ్ నెట్‌వ‌ర్క్ సెక్యూరిటీ

 

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప‌రీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి?

ఎస్బీఐ బ్యాంక్ పీఓ ప్రిప‌రేష‌న్‌కు రెఫ‌రెన్స్ పుస్త‌కాలు

ప్రిప‌రేష‌న్ కోసం అభ్య‌ర్థులు వివిధ పుస్త‌కాలు చ‌ద‌వాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్య‌మైన పుస్త‌కాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

క్ర‌మ సంఖ్య సెక్ష‌న్       పుస్త‌కాల పేర్లు
1ఇంగ్లీష్‌వ్రెన్ అండ్ మార్టిన్ రాసిన హైస్కూల్ ఇంగ్లీష్ గ్రామ‌ర్‌, కంపోజిష‌న్‌
2న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ (మ్యాథ్స్‌)ఎన్సీఈఆర్టీకి చెందిన 6 నుంచి 10వ త‌ర‌గ‌తుల వ‌ర‌కు గ‌ల టెక్స్ట్‌బుక్స్‌

11, 12వ త‌ర‌గ‌తుల టెక్స్ట్‌బుక్స్‌- ఆర్డీ శ‌ర్మ‌

ఆర్ ఎస్ అగ‌ర్వాల్

ఎమ్ టైరా రాసిన క్విక్ మ్యాథ్స్‌

రాజేష్ శ‌ర్మ‌(అరిహంత్ ప‌బ్లికేష‌న్‌) రాసిన ఫాస్ట్ ట్రాక్ అబ్జెక్టివ్ అర్థ‌మెటిక్‌

3రీజ‌నింగ్ఆర్ ఎస్ అగ‌ర్వాల్ రాసిన మోడ్ర‌న్ అప్రోచ్ టు వ‌ర్బ‌ల్ అండ్ నాన్ వ‌ర్బ‌ల్ రీజ‌నింగ్‌

ఎంకే పాండే రాసిన అన‌లిటిక‌ల్ రీజ‌నింగ్‌

4బ్యాకింగ్ అవేర్‌నెస్‌అరిహంత్ ప‌బ్లికేష‌న్ ప్ర‌చురించిన‌ బ్యాకింగ్ అవేర్‌నెస్

ఐబీసీ అకాడ‌మీ ప‌బ్లికేష‌న్ బ్యాకింగ్ అవేర్‌నెస్‌పై ప్ర‌చురించిన హ్యాండ్ బుక్‌

5.కంప్యూట‌ర్ అవేర్‌నెస్‌

అరిహంత్ ప‌బ్లికేష‌న్ ప్ర‌చురించిన కంప్యూట‌ర్ అవేర్ నెస్‌

5జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌6-10 త‌ర‌గ‌తుల హిస్ట‌రీ, సివిక్స్‌, సోష‌ల్ సైన్సెస్‌, సైన్స్

స్టాటిక్ జీకే – లూసెంట్ (హిస్ట‌రీ, పాలిటిక్స్‌, జ‌న‌ర‌ల్ సైన్స్‌)

మ‌నోర‌మ ప‌బ్లికేష‌న్స్ (ఇయ‌ర్లీ బుక్‌)

అరిహంత్ ప‌బ్లికేష‌న్‌

ప్ర‌తియోగితా ద‌ర్ప‌ణ్(మంత్లీ)

6క‌రెంట్ ఆఫైర్స్‌న్యూస్ పేప‌ర్లు :  ది హిందూ, ది ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్‌,  ఎక‌న‌మిక్ టైమ్స్‌, ఫ్రంట్ పేజ్‌, ఎడిటోరియ‌ల్, ఇంట‌ర్నేష‌న‌ల్

మ్యాగ‌జైన్స్‌: అవుట్‌టుక్‌, ది ఫ్రంట్‌లైన్‌

ఎస్బీఐ పీఓ అఫిషియ‌ల్ నోటిఫికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఎస్బీఐ పీఓ ప్రిపరేష‌న్ 2019

క‌రెంట్ ఆఫైర్స్ కోసం బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌

జీకే టుడే (క‌రెంట్ అఫైర్స్, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్)

బ్యాంక‌ర్స్ అడ్డా(ఇంగ్లీష్, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, రీజ‌నింగ్‌, కంప్యూట‌ర్ అవేర్నెస్‌, బ్యాకింగ్ అవేర్‌నెస్‌, క‌రెంట్ అఫైర్స్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నోట్స్‌, ప్రాక్టీస్ క్వ‌శ్చ‌న్స్‌, క్విజ్‌లు, మాక్ టెస్టులు, నెల‌వారీ ముఖ్యాంశాలు ఈ వెబ్‌సైట్‌లో ల‌భిస్తాయి.)

బ్యాంక్ ఎగ్జామ్ టుడే (గ‌తేడాది క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు)

గ్రేడ్ అప్ (మాక్ టెస్టుల‌తో క‌లిపిన అన్ని టాపిక్కులు)

 

ఎస్బీఐ పీఓ అధికారిక నోటిఫికేష‌న్ ఇక్క‌డ డౌన్‌లోడ్ చేసుకోండి

ఎస్బీఐ పీఓ ప్రిపరేష‌న్ 2019

క‌రెంట్ ఆఫైర్స్ కోసం బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌

జీకే టుడే (క‌రెంట్ అఫైర్స్, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్)

బ్యాంక‌ర్స్ అడ్డా(ఇంగ్లీష్, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, రీజ‌నింగ్‌, కంప్యూట‌ర్ అవేర్నెస్‌, బ్యాకింగ్ అవేర్‌నెస్‌, క‌రెంట్ అఫైర్స్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నోట్స్‌, ప్రాక్టీస్ క్వ‌శ్చ‌న్స్‌, క్విజ్‌లు, మాక్ టెస్టులు, నెల‌వారీ ముఖ్యాంశాలు ఈ వెబ్‌సైట్‌లో ల‌భిస్తాయి.)

బ్యాంక్ ఎగ్జామ్ టుడే (గ‌తేడాది క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు)

గ్రేడ్ అప్ (మాక్ టెస్టుల‌తో క‌లిపిన అన్ని టాపిక్కులు)

మీ ఇంగ్లీషును ఇంప్రూవ్ చేసుకోవ‌డం ఎలా?

ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేప‌ర్లు ప్ర‌తిరోజూ చ‌ద‌వాలి. ఎడిటోరియ‌ల్ మీద దృష్టి పెట్టాలి. కొత్త ప‌దాలు నోట్ చేసుకుని వాటి అర్థాలు తెలుసుకోవాలి.

ఇంగ్లీష్ సినిమాలు చూడండి.

మీ స్నేహితులతో ఇంగ్లీషులో సంభాషించండి.

ఇంగ్లీష్ న్యూస్ పేప‌ర్ ఎలా చ‌ద‌వాలి?

మీకు న్యూస్ పేప‌ర్ల‌లో ఏవైనా సందేహాలుంటే సంబంధిత ఆర్టిక‌ల్ మీద కామెంట్ చేయండి. మేము దానికి త‌గిన ప‌రిష్కారం చూపిస్తాం.

ఎస్బీఐ క్ల‌ర్క్ 2019 నోటిఫికేష‌న్ కోసం తెలుసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి మ‌రింత స‌మాచారం తెలుసుకోవాలంటే, మ‌మ్మ‌ల్ని ఫేస్ బుక్ పేజీలో సంప్ర‌దించండి. మీకు కావాల్సిన స‌మాచారం మేము అందిస్తాం. మా వెబ్‌సైట్ తో ట‌చ్‌లో ఉండ‌టానికి కింది లింక్ క్లిక్ చేయండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here